బోధన్‌లో రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో పట్టణ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో CCPS సిబ్బంది శ్రీనివాస్, సురేష్, శృతి, భూపతి రెడ్డి పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ కాల్స్, ఫోన్ ద్వారా బ్యాంకు వివరాలు, OTPలు అడిగి మోసం చేయడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ లేదా లింకులు నమ్మకూడదని, డిజిటల్ అరెస్ట్ అనే విషయం అసలు లేదని స్పష్టం చేశారు.


ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి అని సూచించారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికిరణ్, ఎస్‌బీఐ బోధన్ బ్రాంచ్ మేనేజర్ ప్రదీప్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడం ద్వారా మాత్రమే ఆర్థిక నష్టాలను నివారించవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment