|| దృశ్యం న్యూస్ ||
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనగర్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కిరాణా షాపుపై మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో జరిగిన ఈ దాడిలో రవీందర్ కిరాణా షాప్ నుండి మొత్తం 76.985 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన మద్యం మరియు నిందితుడిని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించి పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ, “జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణా, నిల్వ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని” హెచ్చరించారు. అలాగే, ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సూచించారు.








