మెదక్ టాస్క్ ఫోర్స్ దాడులు – పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై బిగ్ యాక్షన్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక తనిఖీల్లో అల్లాదుర్గ్ మండల పరిధిలో 60 పీడీఎస్ బియ్యం సంచులు, టేక్మాల్ మండల పరిధిలో 40 పీడీఎస్ బియ్యం సంచులు రవాణా చేస్తున్న రెండు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బియ్యం సంచులు మరియు వాహనాలను సంబంధిత అల్లాదుర్గ్, టేక్మాల్ పోలీస్ స్టేషన్లకు తరలించి, కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ చర్యలతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ – “జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడరాదు అని, ఇలాంటి ఘటనలు గమనించిన పౌరులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి” అని స్పష్టం చేశారు.
టాస్క్ ఫోర్స్ చర్యలు నిరంతరం కొనసాగుతాయని, ప్రభుత్వానికి చెందని అన్నపూర్ణ పథకం బియ్యం దుర్వినియోగం చేసేవారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే ఈ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టగలమని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment