మెదక్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – 8.15 కేజీల గంజాయి నిర్వీర్యం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తాజా దాడుల్లో పోలీసులు 5 కేసుల్లో 8 కేజీలు 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు.

 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కోసం పాఠశాలలు, కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించి చెడు వ్యసనాల నుంచి రక్షించాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరా కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 100కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment