ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. సాలూర మండలం నుండి నిజామాబాద్ పట్టణం వరకు పదుల సంఖ్యలో ట్రాలీ ఆటోలలో బోధన్ ప్రాంతం నుండి ఎడపల్లి పోలీస్ స్టేషన్, నిజామాబాద్ 6వ పట్టణ పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా ప్రయాణిస్తుండటం ఆశ్చర్యకరం.

గత 15 రోజుల క్రితం ఎడపల్లి పోలీసులు కొన్ని వాహనాలను అదుపులోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టిన అక్రమ రవాణా మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ప్రతీ రోజు తెల్లవారుజామునే నుండే టన్నుల కొద్ది ఇసుకను నిజామాబాద్ పట్టణానికి, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నా ఈ రవాణా వెనుక ఎవరి ప్రమేయం ఉందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లుతున్నా, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.

అక్రమ రవాణా పై అప్పుడప్పుడు చూపే ఆకస్మిక చర్యలతో సమస్య పరిష్కారం కావడం లేదు. ఎక్కడి నుండి ఇసుక వస్తోంది? ఎవరు పంపుతున్నారు? ఎవరు తీసుకుంటున్నారు? అనే విషయాల్లో విచారణ జరిపి బాధ్యులపై శిక్షలు విధించే ధైర్యం అధికారులు చూపడం లేదు.

స్థానికంగా ప్రశ్న ఉత్పన్నం అవుతోంది ఒక్కటే – ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న కాంట్రాక్టర్లపై అక్రమ రవాణాదారులపై, సంబదిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా? లేక ఇలాగే కాపాయపన చేస్తారా? అంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఈ అక్రమాన్ని ఆపే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment