|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేరుగా జిపి సిబ్బందిపై పడటంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు అధికారిక పనులలో భాగంగా ప్రయాణిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








