నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ప్రమాద ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం, 44వ నెంబర్ జాతీయ రహదారిపై దేవి తండా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద నిలిచివున్న లారీని కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, విశాల్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాత్రివేళల్లో వాహనదారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment