ధర్పల్లి మండలంలో గణేష్ మండప నిర్వాహకులు – DJ యజమానులతో పోలీసుల సమావేశం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులు, DJ యజమానులతో ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్సై కల్యాణి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా CI మాట్లాడుతూ గణేష్ మండప నిర్వాహకులు ఆన్‌లైన్ అనుమతి ప్రక్రియను తక్షణమే పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే పండగ సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మండపాల వద్ద విద్యుత్, భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు.

మండపాల వద్ద పెట్టే సౌండ్ సిస్టమ్ వలన ప్రజలకు ఇబ్బంది కలగకూడదని, నిమజ్జనం సమయంలో ఎక్కడా DJ లు వినిపించకూడదని స్పష్టంగా తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి, శ్రద్ధ, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ధర్పల్లి ఎస్సై ఫోన్ నంబర్ 8712659856 లేదా 100 డయల్ చేయాలని పోలీసు అధికారులు కోరారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని గణేష్ మండప నిర్వాహకులు, DJ ఓనర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment