ధర్పల్లి: వినాయక చవితి సందర్భంగా పోలీసు అధికారుల కఠిన హెచ్చరికలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. బిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ బిక్షపతి మాట్లాడుతూ, రానున్న వినాయక చవితి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబడదని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే, యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాల అలవాటుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు చెప్పాలని కోరారు. ప్రజల భద్రత, శాంతి భద్రతలు కాపాడడం తమ ప్రాధాన్యమని సీఐ బిక్షపతి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ధర్పల్లి ఎస్సై ఎం. కళ్యాణి, పోలీస్ సిబ్బంది, స్థానిక విలేకరులు పాల్గొన్నారు. పోలీసులు ప్రజలను నిబంధనలకు సహకరించాలనీ, వినాయక చవితి శోభాయాత్రలు శాంతియుతంగా జరగాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment