ధర్పల్లి: ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా – అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా నిర్బంధం లేకుండా కొనసాగుతుంది. ఖాళీ స్థలాల్లో ఇసుక డంపులు వేసి, మరుసటి రోజు రాత్రి వేళల్లో తరలింపులు జరిపి లాభాలు ఆర్జిస్తున్నారని స్థానికుల్లో చర్చ. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుకను అందిస్తుండగా, దాన్ని సద్వినియోగం చేయాల్సిన చోట అక్రమార్కులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.

 

మండల రెవెన్యూ కార్యాలయం పర్యవేక్షణలో లోపాల కారణంగా ఇసుక అనుమతులు ఇష్టానుసారంగా జారీ అవుతున్నాయి. ఫలితంగా, అక్రమంగా ట్రాక్టర్లలలో ఇసుక రవాణా అవుతున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత మోపుకుంటూ చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిస్థితి కారణంగా అక్రమ ఇసుక రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది.

ఇటీవల తగిన సమాచారంతో విలేకరులతో కలిసి మండల తాసిల్దార్ ఆకస్మిక పరిశీలన చేపట్టి పలు ఇసుక డంపులను సీజ్ చేశారు.
అయిన అక్రమాలకు అదుపు లేకుండా పోయింది.
ఇకపై ఇందిరమ్మ ఇండ్లను ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాతనే అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తూ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేకుండా అనుమతులు జారీ చెయ్యడం జరగదని ఎవరైనా అవినీతికి లేదా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment