|| దృశ్యం న్యూస్ ||
జానకంపేట్ – బోధన్ స్టేషన్ల మధ్య రైల్వే లైన్ మరమ్మతుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 30 అర్థరాత్రి 12 గంటల నుండి జూలై 31 రాత్రి 11 గంటల వరకు రైల్వే లైన్‌కు అనుసంధానమైన గేట్లను తాత్కాలికంగా మూసివేస్తామని తెలిపారు.
ఈ సమయంలో జాన్కంపేట్ – బోధన్, ప్రధాన రహదారిలో ఎడపల్లి వద్ద ఉన్న రైల్వే గేట్ మరియు సాటాపూర్ గెట్, జైతపూర్, జమ్లం, దుపల్లి గేట్, పోచారం గ్రామాలకు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. ప్రయాణాల్లో అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని రైల్వే అధికారులు సూచించారు.

ఈ మరమ్మతుల పనులకు సహకరించాలని రైల్వే శాఖ వాహనదారులకు, స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు, ముందుగానే చేరవేయబడినట్టు వెల్లడించారు.
ప్రయాణికులకు ముందస్తుగా సమాచారం అందజేయడం కోసం పాత్రికేయులకు వివరాలు అందించడం జరిగింది.








