ఎడపల్లి మండలంలో అనుమతులు లేని వేచర్లలలో ప్లాట్ల విక్రయాలు – కొనుగోలుదారులకు అధికారుల హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపెట్ గ్రామ పరిధిలోని అలిసాగర్ రహదారి పక్కన “డాలర్ హిల్స్ రెసిడెన్షియల్ కాలనీ” పేరుతో అనుమతులు లేకుండా వెంచర్ యజమానులు ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు.

ఈ వెంచర్‌కి DTCP (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) మరియు స్థానిక ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండానే, ఆకర్షణీయమైన మ్యాపులు, మోడల్ ప్లాన్లు, హంగులతో కూడిన ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్నారు. మురుగునీటి పారుదల, నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు, రహదారి అభివృద్ధి వంటి ప్రాథమిక అవసరాలకు అవసరమైన అనుమతులు లేకుండానే ప్లాట్ల విక్రయాలు జరగడం తీవ్రంగా వివాదాస్పదమైంది.

అనుమతులేని ఈ వెంచర్‌ను సోషల్ మీడియా వేదికగా మరియు స్థానిక మధ్యవర్తుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ సరైన అనుమతుల పత్రాలు లేకుండానే ప్లాట్లు విక్రయించడమే గాక కొనుగోలుదారులను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారు.

సంబంధిత అధికారులు స్పష్టం చేస్తూ” సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా ఎలాంటి ప్లాట్ కొనుగోలు చేయవద్దు అని, ప్రభుత్వ అధికారిక సంస్థల అనుమతులు పరిశీలించిన తరువాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలి అని కొనుగోలుదారులను హెచ్చరిస్తున్నారు.

 

అదేవిధంగా ఈ తరహా అక్రమ వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్థానికులు అభ్యర్థన చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment