ఒకే రాత్రిలో 11 ఇండ్లలో భారీ దొంగతనం – నేరస్థుల పట్టివేతకు ప్రత్యేక సీసీఎస్ బృందాలు ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఒకేసారి 11 ఇండ్లలో దొంగతనాలు చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ విషయంలో గురువారం ఉదయం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా గ్రామాన్ని సందర్శించి, ఘటనాస్థలాన్ని సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “ఇది అత్యంత గంభీరమైన సంఘటన అని, ప్రజల భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం అని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ప్రత్యేక సిసిఎస్ బృందాలను రంగంలోకి దింపాము,” అని తెలిపారు. సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

 

ప్రజల ఆందోళనను పోలీస్ శాఖ పూర్తిగా అర్థం చేసుకుంటోందని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు.

ఈ తనిఖీలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సీఐ ఎన్. సురేష్ కుమార్, ఎస్సై జెడ్. సుస్మిత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment