|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పట్టణంలో TGOs ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమం ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా గౌరవనీయ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించారు.

ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ తెలంగాణ బోనాలు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంపదను ప్రతిబింబిస్తాయని పోలీస్ కమిషనర్ అన్నారు. బోనాలు అనేవి అమ్మవారికి ఇచ్చే పవిత్ర నైవేద్య స్వరూపమని, ఈ పండుగ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “అమ్మవారి ఆశీస్సులతో మన సమాజం శాంతి, సమృద్ధి పథంలో నడవాలి అని. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.

కార్యక్రమంలో పలువురు TGOs సభ్యులు, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తిని చాటారు.

ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు జీవితాంతం గుర్తుండిపోయేలా నిలిచింది అని, TGOs సంస్థ నిరంతరం ఇలాగే మన సంస్కృతిని పరిరక్షిస్తూ ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడ్డారు.








