సిరికొండ: ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి ఆకస్మిక పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్ అంకిత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అలాగే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాములు సరఫరాపై విద్యార్థులతోనే నేరుగా సమాచారం సేకరించారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన జరిపి, నిబంధనల ప్రకారం భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ పర్యటనలో సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎంపీఈవో తారాచంద్, పంచాయతీ కార్యదర్శి వినీల్, ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment