|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో ఈరోజు ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. బోధన్ నుండి నిజామాబాద్ వైపు ఏటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో లారీ ఓనర్ అజీజ్ మరియు డ్రైవర్ సిరాజ్ను అరెస్టు చేసి, చట్టపరమైన చర్యల కోసం ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








