వర్ని: అనుమానాస్పద స్థితిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాంపల్లి రాములు (వయసు 53) తండ్రి వృత్తి: ఫీల్డ్ అసిస్టెంట్ – అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం కుటుంబ సభ్యులు లేచేసరికి రాములు తన ఇంట్లో నిశ్చలంగా పడి ఉండటంతో అప్పటికే మరణించినట్టు గుర్తించారు. మృతుని తల్లి నాంపల్లి పోశవ్వ వర్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎస్సై మహేష్ దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment