ఎడపల్లిలో రోడ్డు ప్రమాదం – బైక్ సవారీదారుడు మృతి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బుధవారం ఉదయం దురదృష్టకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఎడపల్లి పోలీస్ స్టేషన్లో చాపరల రాజశేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆయన అల్లుడు నిమ్మగడ్డ రమేష్ (57) ఎడపల్లి గ్రామ శివారులోని సరయు ఫంక్షన్ హాల్ వద్ద బైక్‌తో U టర్న్ తీసుకుంటుండగా నిజామాబాద్ నుండి బోధన్ వైపు అతివేగంగా వచ్చిన TS16EY 9473 నంబర్ గల కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో రమేష్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు అని, కారు డ్రైవర్ రాజేష్ అజాగ్రత్తగా వాహనం నడిపినందునే ఈ ప్రమాదం జరిగిందని రాజశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment