|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మొదటి అదనపు జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఈ. సాయి శివ బుధవారం నాడు కీలక తీర్పు వెల్లడించారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న కేసులో నిజామాబాద్‌కు చెందిన మోహమ్మద్ సుమేర్ ఖాన్, మోహమ్మద్ అర్బాజ్‌లకు ముగ్గురు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.3000 జరిమానా విధించారు.
నిందితులు AP25X 8808 వాహనంలో రేషన్ బియ్యాన్ని నిజామాబాద్ నుండి బోధన్ వైపు రవాణా చేస్తుండగా, ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట్ గ్రామం వద్ద అ అ సమయంలో ఎస్ఐగా ఉన్న టాటా బాబు వాహనాన్ని పట్టుకొని వారిని అరెస్ట్ చేశారు. అనంతరం కేసు దర్యాప్తులో సాక్ష్యాధారాలతో కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది , న్యాయస్థానం తీర్పు మేరకు ప్రస్తుత ఎస్ఐ వంశీ కృష్ణ రెడ్డి చర్యలు చేపట్టారు.
ఈ తీర్పు ప్రజా పంపిణీ వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తులకు గుణపాఠంగా నిలుస్తుంది అని. న్యాయవ్యవస్థ ప్రజలకు న్యాయం చేసి, అక్రమాలకు తగిన శిక్ష విధిస్తుందనే సందేశం ఇచ్చింది.








