పెన్షన్ అమలుపై బీజేపీ రాస్తారోకో – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన జరిగింది. అనంతరం ఎమ్మార్వో కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు.

బీజేపీ మండల అధ్యక్షుడు కల్లూరి హనుమండ్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. వృద్ధులు, బీడి కార్మికులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. వెంటనే కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, లేదంటే బీజేపీ తీవ్ర ఉద్యమానికి దిగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అశోక్, శంకర్, మక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment