|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ఆదర్శ యువతి సమాఖ్య ఆధ్వర్యం వహించింది. ముఖ్య అతిథిగా పద్మసింగ్ హాజరై మహారాణా ప్రతాప్ విభిన్న శౌర్య గాథలను వివరించారు.

మహారాణా ప్రతాప్ 1540 మే 9న రాజస్థాన్‌లోని చితోడ్‌లో ఉదయ్ సింగ్, జేవంత్ బాయ్ దంపతులకు జన్మించారు. మహారాణా గుర్రం “చేతక్” చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది అని, మేవార్ పాలకుడిగా ఉన్న మహారాణా ప్రతాప్ మొఘలులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. స్వాతంత్రం కోసం తిండి లేక గడ్డి రొట్టెలతో జీవించి పోరాటం కొనసాగించారు అని,
1597 జనవరి 9న చావండీ వేట సమయంలో గాయాల కారణంగా మహారాజు పరమపదించారు అని, ఆయన జీవితం ధైర్యం, త్యాగం, స్వభిమానానికి ప్రతీకగా నిలిచి ఎందరికో ఆదర్శంగా ఉన్నారని తెలియచేసారు.
ఈ వేడుకలో మదన్ సింగ్, రాజేందర్ సింగ్, గోపి సింగ్, గీత సింగ్ తదితరులు పాల్గొన్నారు.








