|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడులు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో జరుగుతున్నాయి. పోలీసుల ఈ ఆకస్మిక దాడులు బాధితులకు కాస్త ఊరట కలిగించాయి. అనధికార రీతిలో డబ్బులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ స్పష్టం చేశారు.
ఇటువంటి అక్రమ లావాదేవీలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లేఖల ద్వారా ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో ఈ దాడులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి.








