బోధన్: పేరుకే బోధన్ జిల్లా హాస్పిటల్ – సమయానికి రాని వైద్యులు!

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్య ధోరణిపై తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యుల పనితీరును ఎత్తిచూపుతూ, ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చే పేద ప్రజలు వైద్య సేవలు పొందడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.

హాస్పిటల్‌లో విధులు నిర్వహించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, టైం పాటించని వైద్యులపై సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డాక్టర్ యాసిష్ రాజ్ రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment