ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా: ప్రభుత్వ ఆదేశాలను లెక్క చెయ్యని అధికార యంత్రాంగం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, సాలురా మండలం మంధర్నా గ్రామంలో మంజీరా పరీవాహక నది నుండి అక్రమ ఇసుక రవాణా ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పనుల కోసం అనుమతులు తీసుకున్నప్పటికీ ఆ పరిమితిని మించి ఇసుక తరలిస్తూ ప్రైవేట్ కట్టడాల వద్ద అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వారం రోజులు అనుమతులు ఇచ్చి అక్రమ మాఫియాదారులకు ఇష్టారీతిన ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించడం తో ఈ అక్రమ రవాణా మరింతగా పెరిగింది.

 

ఇసుక అక్రమ రవాణాను నిరోధించాల్సిన సంబంధిత అధికారులు దీనిపై చర్యలు చేపట్టడం లేదు. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ రవాణా జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసిన ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో సంబంధిత అధికార యంత్రాంగం నుండి తగు చర్యలు శూన్యమే అని చెప్పవచ్చు.
భూగర్భ జలాలు తగ్గిపోతాయని తమ బోర్లు ఎండిపోతాయనే భయంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment