పిడిఎస్ బియ్యం మాఫియా: యదేశ్చగా ఆటోలలో వచ్చి కొనుగోలు చేస్తున్న అక్రమార్కులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పలు గ్రామాల్లో పిడిఎస్ బియ్యం మాఫియా కొనసాగుతోంది. కొన్ని చోట్ల లబ్ధి దారుల నుంచి కొందరు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు ఇతరులకు విక్రయించడం జరుగుతోంది.

రేషన్ షాపులలో బియ్యం సరఫరా ప్రక్రియ ప్రారంభం అయ్యే రోజు నుండి చివరి రోజు వరకు కొంతమంది ఆటోల ద్వారా లబ్ధి దారుల వద్ద నుంచి బియ్యం సేకరించి, దానిని అక్రమదారుల వద్ద అధిక ధరలకు అమ్ముతున్నారు.

పేద ప్రజలు ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సంబంధిత అధికారులు ఈ మాఫియా కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment