ధర్పల్లి: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా – అధికారుల నిర్లక్ష్యంతోనే ఉల్లంఘనలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది.

శుక్రవారం మధ్యాహ్నం వాడి వాగు వద్ద జేసిబి సహాయంతో ట్రాక్టర్లలో ఇసుక నింపుతున్న దృశ్యాలు వెలుగు చూశాయి. అయితే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేవలం కూలీల ద్వారా ఇసుక నింపాలని సూచించినప్పటికీ, ప్రభుత్వం పేద కూలీలకు ఉపాధి కలిగించాలనే ఉదేశ్యంతో ఈ నిర్ణయం అమలులోకి తీసుకువచ్చిన, అక్రమంగా జేసిబి వాహనాన్ని వినియోగించడం గమనార్హం. అధికారుల ప్రమేయం లేకుండానే ఈ తతంగం జరుగుతుందా అంటూ, ఈ ఇసుక రవాణాపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెసిబి వాహనంతో తవ్వకాలు చేస్తుండగా ఈ విషయం గమనించిన స్థానికుల సమాచారంతో మండల ఎమ్మార్వో మలతి ఈ విషయంపై స్పందించి, ఇసుక రవాణాను తక్షణమే అడ్డుకున్నారు.
అయితే, మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనుల కోసం అంటూ భారీగా ఇసుక నిల్వ చేయడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి అక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు ఇసుక లభించాలని, ఉన్నత అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment