|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్పజొలంలను డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జక్రన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామం లోని మెడికేర్ సర్వీసెస్ వద్ద జరిగింది.

ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ IPS ఆధ్వర్యంలో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ డిస్పోజల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ పోలీస్ స్టేషన్ల నుండి 23 కేసులలో సీజ్ చేసిన గంజాయి (616 కేజీల 837 గ్రాములు) మరియు అల్పజొలం (3 కేజీల 444 గ్రాములు) ను కాల్చివేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులుగా అడిషనల్ డీ.సీ.పీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏ.సి.పి రాజ వెంకట్ రామ్ రెడ్డి, CCRB ఏ.సి.పి రవీందర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.








