మెదక్ : ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ : శాలువా పూలమాలతో సత్కరించిన ఎస్.పి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి శాలువా పూలమాలతో సత్కరించి సాదరంగా పదవీ విరమణను జరిపారు.

1982లో పోలీసు కానిస్టేబుల్‌గా మెదక్ జిల్లాలో చేరిన శ్రీనివాస్ 43 సంవత్సరాల 6 నెలల సుదీర్ఘ సేవ తర్వాత నర్సాపూర్ ఎస్సైగా పదవీ విరమణ చేశారు. సర్వీసులో భాగంగా 2001లో హెడ్ కానిస్టేబుల్, 2011లో ఏఎస్ఐ, 2015లో ఎస్సైగా అంచలంచలుగా పదోన్నతి పొందారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీనివాస్ “పోలీసు వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివి. మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణలో చేసిన సేవలు గొప్పవి” అని అభినందించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు.

శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలను ప్రభుత్వము గుర్తించి, ఉత్తమ సేవా పథకాలతో గౌరవించింది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి యస్. మహేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, వాళ్య నాయక్ కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment