|| దృశ్యం న్యూస్ ||
జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు రక్షణ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పూర్తి జాతర స్థలాన్ని సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచామన్నారు.
జిల్లా ఎస్.పి. సూచనల ప్రకారం, భక్తులు జాగ్రత్తగా ఉండాలి అని, అనుమానిత వస్తువులను తాకకూడదని, వాహనాలను పోర్టుల వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు. ప్రత్యేకంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అత్యవసర సమయాల్లో పోలీసు సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్‌లో ఉన్న వారు సహాయం చేయవచ్చని తెలిపారు.

సమావేశంలో మహిళల భద్రత కోసం షీ టీమ్, మఫ్టీ టీమ్, ఫుట్ పెట్రోలింగ్ బృందాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా కంట్రోల్ రూమ్ సమీక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహాశివరాత్రి సందర్భంగా, 883 మంది పోలీసు సిబ్బంది,
9 స్పెషల్ పార్టీలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఉండే భక్తులు, పార్కింగ్ కోసం కేటాయించిన ప్రత్యేక స్థలాల్లో వాహనాలు నిలిపి పోలీసు సిబ్బందితో సహకరించాలని జిల్లా ఎస్.పి. విజ్ఞప్తి చేశారు.
భక్తులకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే, డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎస్.పి. సూచించారు.








