జోరుగా తరలిపోతున్న మద్యం : మద్యం ప్రియుల వద్ద దోపిడీకి సిద్ధమైన అక్రమదారులు.

|| దృశ్యం న్యూస్ ||

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం రెండు రోజులపాటు వైన్స్ దుకాణాలు మూసివేయబడుతున్నాయి.
ఈ సమయంలో నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో కొంతమంది అక్రమ మద్యం వ్యాపారులు, తమ పలుకుబడి ఉపయోగించి భారీ మొత్తంలో మద్యం బాటిళ్లను ఆటోలు, ఇతర వాహనాల ద్వారా రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిఘా లోపం వల్ల అక్రమంగా మద్యం జోరుగా తరలిపోతుందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ రెండు రోజులపాటు మద్యం అమ్మకాలపై అధిక రేటు విధించి సొమ్ము చేసుకోవడంలో వ్యాపారులు అన్ని సన్నహాలు చేస్తున్నారు, పేరుకే వైన్స్ దుకాణాలు బంద్ డబ్బులు ఎక్కువ చెల్లిస్తే ఎక్కడైనా ఏ సమయంలో అయిన మద్యం ఎంతైనా లభిస్తుంది.

వైన్స్ దుకాణాలు మూసివేయడం ఏమిటో కానీ కొంతమంది అక్రమ మద్యం వ్యాపారులకు మంచి అవకాశం కల్పిస్తూ దొరికినంత దోచుకోవడానికి సిద్ధం చెయ్యడమే అన్నట్టుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది.
ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ఆదేశాలను సంబంధిత అధికారులు కఠినంగా అమలు చేసి ఇలాంటి చర్యలను అదుపు చెయ్యాలని స్థానికులు, ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment