|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ గ్రామంలో సోన్కంబ్లే వినోద్ (30) ఆదివారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నిజాంసాగర్ D46 కెనాల్‌లో పడిపోయి మృతిచెందాడు.
నాందేడ్ జిల్లాకు చెందిన వినోద్ గత మూడు రోజుల క్రితం ARP క్యాంప్ లోని ఇటుక తయారీ కేంద్రంలో కూలీ పనులకు చేరాడు. ఈ ప్రమాదం తరువాత స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ప్రతి సంవత్సరం ఇటుక తయారీ కోసం, ఇటుక తయారీ కేంద్రాల యజమానులు ఇతర రాష్ట్రాల నుండి కూలీలను ఆహ్వానించి వారానికి ఒకసారి లేదా రోజువారి కూలీ చెల్లిస్తూ వ్యాపారం కొనసాగిస్తారు. కానీ ఈ కేంద్రాల్లో కొందరు వ్యాపారులు కూలీలకు కనీస అవసరాల కోసం సరైన సదుపాయాలు కల్పించకుండా వ్యాపారం సాగిస్తూ ఉంటారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా కూలీలకు ప్రమాద భీమా లేదా ఆధునిక భద్రతా పరికరాలు లేకుండా ఈ వ్యాపారం కొనసాగిస్తూనే ఉంటారు.
ఇటుక తయారీ కేంద్రాలలో కూలీలకు కనీస సౌకర్యాలు లేకుండా ఉండటం వల్ల వారు కాలువలు, చెరువులు వంటి ప్రమాదకర ప్రాంతాలను ఆశ్రయించడం వలన అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అదేవిధంగా విద్యుత్ తీగలు, విష పురుగులు, మరియు ఇతర ప్రమాదాలు అనారోగ్యం కారణల వల్ల కూలీలు ఎంతో మంది మరణిస్తున్నారు.

కూలీలకు ఇలా ప్రమాదాలు ఎన్ని చోటు చేసుకున్న, యజమానులు నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురైన, వారి సమస్యలు తెలుసుకొని సహకరించి సహాయం అందించే వారే లేకపోవడంతో ఈ వ్యాపారం సజావుగా కొనసాగుతూ నిర్వాహకుల నిర్లక్ష్యనికి, అధికారుల నిర్లక్ష్యనికి కూలీలు బలి అవుతూనే ఉన్నారు.
ఇటుక తయారీ కేంద్రాలకు సంబంధించిన మట్టి సేకరణ అనుమతులు, కార్మికులకు సంబంధించిన భద్రతా ప్రణాళికలు, చిన్న పిల్లల పనులపై నిబంధనలు, పాఠశాల వసతుల వంటి అవసరాలు సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఇటుక తయారీ కేంద్రాలలో నిర్వాహకులు అమలు చెయ్యడం లేదు.

ఈ విధంగా కూడా అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణలు అవుతున్నాయి, కూలీలకు సహాయం చేయడానికి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో వారు ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు ఇటుక తయారీ కేంద్రాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని, సక్రమమైన నిబంధనలతో ఈ వ్యాపారాన్ని నిర్వహించాలని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.








