విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ ||

గత నెల 7న, కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని తాటిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా భూమిని చదును చేసిన ట్రాక్టర్లను పట్టుకుని సిరికొండ అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తుండగా, తాటిపల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసి దుర్భాషలాడారు.

ఈ సంఘటన ద్వారా అటవీశాఖ సిబ్బందికి విధుల నిర్వహణలో ఆటంకం కలిగించిన మదన్ లాల్, సావిత్రి, నందిలాల్, మలావత్, భూపతి అనే నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సిరికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది.
ఈ విషయం గురించి సిరికొండ ఇంచార్జ్ ఎఫ్ ఆర్ ఓ రవీందర్ వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment