|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా అర్సపల్లి నిజాం ప్యాలెస్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధునికి బోధన్ డిపోకి చెందిన AP 25 Z 0064 నంబర్ గల TGRTC బస్సు ఢీకొట్టడంతో వృద్ధుని తలకు తీవ్ర గాయాలు జరిగి రక్తస్రావం ఏర్పడింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించి వృద్ధుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు జెబిఎస్ నుండి బోధన్ వైపు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం వృద్ధుని ఆరోగ్య పరిస్థితి మరియు అతని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ సంఘటనపై సంబంధిత 6వ పట్టణ పోలీస్ అధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.








