|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అఫంధి ఫారం దగ్గర డంపింగ్ యార్డ్‌కి కొద్ది దూరంలో చందూర్ వైపు వెళ్ళే రోడ్డులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు 40 నుండి 45 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి అని భావిస్తున్నారు, మృతుడు దాదాపు 20 నుండి 25 రోజులు క్రితం చనిపోయినట్టు గుర్తించబడింది.
ఈ సంఘటనపై అఫంధి ఫారం గ్రామానికి చెందిన రఘు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ మృతుడికి సంబంధిత వివరాలు కానీ, అనుమానాలు ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు.








