వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్, సభ్యులు జాగ్రత్త: సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.

|| దృశ్యం న్యూస్ ||

ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూప్ లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ గ్రూపులు ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అయ్యాయి.
ఎక్కువ మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూప్ లలో అడ్మిన్ గా ఉన్న వ్యక్తులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని వారు అడ్మిన్ అంగీకారం ద్వారా తమ ఆధీనంలో గ్రూప్ లను తీసుకుంటున్నారు.

సైబర్ నేరగాళ్లు నేను పోలీస్ శాఖ లేదా ఇతర అధికారులము అని చెప్తూ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను మాయచేసి గ్రూప్ లో జాయిన్ అయిన అనంతరం ఇతరులను గ్రూప్ లలో చేర్చాలి అడ్మిన్ ఇవ్వండి అంటూ అడ్మిన్ తీసుకున్న వెంటనే గ్రూప్ ను వారి ఆధీనంలోకి తీసుకొని, కొన్ని లింకులను గ్రూప్ లో పెడుతున్నారు, ఈ లింకులను ఓపెన్ చేసిన వారి తమ వ్యక్తిగత గోప్యతా సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

ఇలాంటి సైబర్ నేరాలు అరికట్టేందుకు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు మరియు సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు అనుమానాస్పద లింకులను ఎలాంటి పరిస్థితులలోనూ క్లిక్ చేయకూడదు. అలాగే వారి గ్రూప్ ను కంట్రోల్ చేసే వారికి ఎవరైనా అనుమానా స్పదంగా ఉన్నప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి అని,

ఈ విధంగా సైబర్ నేరగాళ్ల నుండి రక్షణ పొందడం అనేది ప్రతి గ్రూప్ సభ్యుడు, గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండాలని వారి సభ్యుల సమాచార రహస్యాన్ని కాపాడుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment