బోధన్ మండలంలో నల్లమట్టి అనుమతులతో అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, బోధన్ నుండి పెగడపల్లి గ్రామనికి వెళ్లే మార్గంలో ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు సమాచారంతో స్థానిక ఎమ్మార్ఓను సంప్రదించగా నల్లమట్టి అనుమతులతో బర్దిపూర్ వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలిసింది.

 

ఈ అనుమతులు షెడ్డు నిర్మాణం కోసం నల్లమట్టి అనుమతులు మాత్రమే ఇవ్వబడ్డాయి, కానీ ఇసుక రవాణా జరగడం గమానించబడింది.
ఈ చర్య వల్ల ప్రభుత్వం ఆదాయానికి భారీ ఆదాయ నష్టం కలిగిస్తుంది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మార్వో మరియు ఆర్ఐ కి సమాచారం ఇచ్చిన కాసేపటికి ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులు జేసిబిని, ట్రాక్టర్లను ఇతర ప్రాంతాలకు తరలించారు.

 

ఈ చర్యల ద్వారా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మరియు అండతో జరుగుతున్నాయని స్పష్టం అవుతుంది, అధికారులు ప్రదర్శిస్తున్న ఈ వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment