ఖండ్ గాం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ వివాదం: బియ్యం పంపిణీ నిలిపివేత.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో రేషన్ డీలర్‌ షాప్‌లో బియ్యం పంపిణీకి సంబంధించిన వివాదం వెలుగు చూసింది. ఈ రోజు అందించిన రేషన్ బియ్యంలో కొన్ని సంచులు సన్న బియ్యం, మరి కొన్ని సంచులు దొడ్డు బియ్యం ఉన్నాయి అని, దీంతో గ్రామస్థులు ఈ విషయం ఎమ్మార్వో కి ఫోన్ ద్వారా తెలియజేశారు.

ప్రజలకు వివిధ రకాల బియ్యం (సన్న, దొడ్డు) పంపిణీ చేయడం అనేది అన్యాయమని అభిప్రాయపడుతూ ఎమ్మార్వోను సంప్రదించి ఈ సమస్య పరిష్కారం కాని వరకు గ్రామంలో బియ్యం పంపిణీని నిలిపివేస్తామని తెలిపారు.

ప్రభుత్వం సన్న బియ్యం పంపిస్తున్నట్లు చెబుతుంటే, ఈ విధంగా సన్న, దొడ్డు బియ్యం పంపించడం వల్ల ప్రజల మధ్య విబేధాలు తలెత్తి ఇబ్బందులు కలిగిస్తోంది అని, రేషన్ డీలర్‌ మరియు ఎమ్మార్వో కి ఈ సమస్య గురించి తెలియచేస్తూ త్వరలో పరిష్కారం కావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment