అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిన అడిగే నాధుడే లేడు : ఓ నూతన హోటల్ నిర్వహకం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులోని స్ప్రింగ్ హోటల్ నిర్వహకులు కొందరు ప్రముఖుల అండతో అర్ధరాత్రి వరకు వ్యాపారం కొనసాగిస్తున్నారు, హోటల్ యజమానులు తమ వ్యాపారం పట్ల ఉన్న అహంకారం మరియు ప్రముఖుల అనుకూలతను ఎత్తిచూపుతూ ఏ అధికారులు మమ్ములను ఆపగలరు అనే దృఢనమ్మకంతో వ్యాపారం చేస్తున్నారు.

ఈ హోటల్ బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఉన్నప్పటికీ స్థానిక పోలీసు శాఖ అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ దృష్టి పెట్టడం లేదు.
పోలీసు కమిషనర్ ఆదేశాలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధుల పలుకుబడి, ప్రముఖుల అండతో ఈ హోటల్ వ్యాపారం అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.

ఈ ప్రవర్తనపై స్థానికులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తు రాత్రి 10 గంటల సమయం అయిందంటే చిన్న చిన్న వ్యాపారులపై చర్యలు తీసుకునే పోలీసులు, ఇలాంటి హోటల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోరు? అని ప్రశ్నిస్తున్నారు.
గత వారం రోజుల క్రితం ఈ హోటల్ పై కొంతమంది యువకులు దాడి చేసి, సిబ్బందిని హాని పరిచారాని హోటల్ యాజమాన్యం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు.

అర్ధరాత్రి వరకు యదేశ్చగా వ్యాపారం నిర్వహిస్తుంటే “పొకిరీలకు, మద్యం సేవించే వారికి ఈ హోటల్ అడ్డాగా మారకుండా ఉంటుందా, ఇది ఇలాగే కొనసాగితే ఇలాంటి అనుచిత ఘటనలకు కేంద్రంగా మారుతుందని,ఇది వరకు ఈ హొటల్ లో కస్టమర్లకు, సిబ్బంది మధ్య ఎన్నో గొడవలు జరిగాయని సమాచారం, ఈ హోటల్‌ను అదుపులో పెట్టె ప్రయత్నం అధికారులు ఎందుకు చేయడం లేదు ” అనే ప్రశ్నను స్థానికులు వేస్తున్నారు.

అదేవిధంగా ఈ హోటల్ వైపు పోలీసుల దృష్టి ఎందుకు పడటం లేదు అని పలు అనుమానాలు స్థానికుల్లో నిక్షిప్తమై, ఈ హోటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం అవసరం అని కోరుతున్నారు.

ప్రశ్న ఏంటంటే “పోలీసులు, సంబంధిత అధికారులు ఇకనైనా ఈ విషయం మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, లేదా” అనే సందేహం స్థానికుల్లో నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment