|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ యూనివర్సిటీ (తే.యు.) భూములపై కబ్జా జరుగుతోందని, ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారుల నుండి రక్షించాలని PDSU ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి యూనివర్సిటీ చుట్టూ ప్రహరీగోడ నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటును అనేక విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మరియు రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడి యూనివర్సిటీని సాధించాయని గుర్తు చేస్తూ, 574 ఎకరాల భూమిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించిందన్నారు.

కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 54 ఎకరాలు భూమిని తప్పు రికార్డులతో భూమి కాజేయాలని చూసిన కబ్జాదారులపై, అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్ కఠినంగా స్పందించి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎమ్మార్వో రవి కుమార్ ను సస్పెండ్ చేశారని ఈ కేసు విషయంలో కోర్టు కూడా యూనివర్సిటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అని గుర్తుచేసారు.
ఈ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కాపాడి, యూనివర్సిటీకి పూర్తిగా అప్పగించాలని, అందుకోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ విషయమై జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత వహించాలని కోరారు.
PDSU నాయకులు తరుణ్, మహేష్, సృజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








