బోధన్ డివిజన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం.

|| దృశ్యం న్యూస్ ||

బుధవారం రోజున బోధన్ డివిజన్‌లో లయన్స్ భవన్‌లో భారత రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించడం. 2024లో 2569 యూనిట్లు బ్లడ్‌ను జమచేయడం జరిగింది అని, అలాగే 1004 తల సేమియా వ్యాధి గ్రస్తులకు ఉచితంగా బ్లడ్ మరియు చికిత్సకు అవసరమైన మందులు అందించబడ్డాయి అని, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు తెలిపారు.

సమావేశంలో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ ఏడాది జరిగిన కార్యక్రమాల వివరాలను అందించారు. తదనంతరం, ఎసిపి శ్రీనివాస్, ఎమ్మార్వో విటల్ ను కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మరియు డివిజన్ కార్యదర్శులు, అధ్యక్షులు బసవేశ్వర రావు, కరిపె రవీందర్, తోట రాజశేఖర్, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment