|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎమ్మేసి ఫారం వద్ద అంబులెన్స్ బోల్తా కొట్టింది.
నిజామాబాద్ నుండి బోధన్ వైపుగా వెళుతున్న సమయంలో మరొక వాహనాన్ని తప్పించబోయి ప్రైవేట్ అంబులెన్స్ (TS 21 T 4957) ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ అరుణ్ గాయాల పాలయ్యాడు, అప్రమత్తమైన స్థానికులు వెంటనే సహాయం అందించి గాయపడిన డ్రైవర్ ను బోధన్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు.
అదృష్టవశాత్తు అంబులెన్స్ లో ఇతర ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది, అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.








