|| దృశ్యం న్యూస్ ||
వీధి కుక్కల దాడుల వల్ల ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది, శుక్రవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలో ఒక మహిళను కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేశాయి, మహిళ తీవ్ర గాయాలపాలై రక్తస్రావం జరగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
గ్రామంలోని పలువురిపై కూడా ఈ వీధి కుక్కదాడి చేసింది, ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనను నెలకొంది.

కేవలం ఈ గ్రామమే కాకుండా మండలంలోని పలు గ్రామాల ప్రజలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటివరకు ఈ విషయంలో వీధి కుక్కల సమస్య పై ఎన్ని వార్త కధనాలు వచ్చిన అధికారుల నుండి స్పందన కనబడకపోవడం, వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇలాంటి సమస్యలు సకాలంలో పరిష్కారం చెయ్యాలని ఆందోళన వ్యక్తం చేస్తు, ఈ వీధి కుక్కల సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.








