ఘనంగా 39వ గురు గంగాధర జాతర : పెద్ద ఎత్తున పాల్గొన భక్తులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండలం వాడి గ్రామం , మరియు ముంబయి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 39వ గురు గంగాధర స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది.
శుక్రవారం కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాదిలాగే శ్రీ శ్రీ శ్రీ గురు గంగాధర స్వామి వారి గురుపూజా ఆరాధనోత్సవం, జాతరలో, వందలాది భక్తులు మరియు గురు గంగాధర శిష్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ జాతరలో 5,000 మందికి పైగా అన్నదానం నిర్వహించారు, ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు దీపారాధన, 8 గంటలకు గణపతి, నవగ్రహ పూజ, 9 గంటలకు బ్రహ్మ యజ్ఞం, 11 గంటలకు పూర్ణాహుతి, 12 గంటలకు అన్నదానం కార్యక్రమాలు జరుపుకున్నారు.

పల్లకి సేవ గ్రామ కేద్రంలో నుండి ఆశ్రమం వరకు మహిళలు, పిల్లలు, పెద్దలు కలిసి భజన, నృత్యాలు చేస్తూ శోభాయాత్ర మరియు అర్థరాత్రి వరకు భజన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ జాతరకు దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులలో అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగించడానికి పద్మశాలి సంఘం నిర్వాహకులు కట్ట గంగాధర్, కట్ట శంకర్, యెల్లారం భాస్కర్, కట్ట గంగా మోహన్, కట్ట గంగాదాస్, కట్ట రాజ్ కుమార్ తదితరులు పాల్గొని తగిన ఏర్పాట్లు చేసి,
ఈ జాతరలో పాల్గొన్న భక్తులు గురు గంగాధర స్వామి ఆశీస్సులు అందుకోవాలని ఆశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment