బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి

|| దృశ్యం న్యూస్ ||

బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం త్వరగా విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు IIIT బాసరలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే, ఈ విషాద ఘటన తరువాత ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది, దాడిలో తీవ్ర గాయాలపాలైన యం. సాయికుమార్ ను నిజామాబాద్ సివిల్ హాస్పిటల్ లో పరామర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా బాసర IIITలో విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డా మారిన పరిస్థితులపై ధన్ పల్ మాట్లాడుతూ,
సరైన విచారణ కమిటీ ఏర్పాటు చేసి, ఆత్మహత్యలకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని హెచ్చరించారు, ఇలాంటి సంఘటనలకు కారణమైన వారిని, విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి గుండాలుగా వ్యవహరించిన పోలీసుల తీరును ఆగ్రహంతో ఖండించారు.
లాఠీచార్జి కు బాద్యులైన సీఐ రాకేష్ ను విధుల నుండి తొలగించాలని సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్యెల్యే తో పాటు ఏబీవీపీ విభాగ్ ప్రముఖులు రెంజర్ల నరేష్, అడ్వకేట్ జగన్ మోహన్, శ్రీకాంత్, ఆనంద్, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment