ఘనంగా బారడి పోచమ్మ పండుగ: గోపనపల్లి గ్రామంలో ఉత్సవాలు.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపనపల్లి గ్రామంలో ఆదివారం నాడు బారడి పోచమ్మ పండుగ ఘనంగా జరిగింది.
ఈ ఉత్సవంలో గ్రామస్థులు బోనాలు ఎత్తుకొని భజ భజంత్రీలతో గోపనపల్లి నుండి బిచ్కుంద పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్రను నిర్వహించారు.
గ్రామంలో అతి పెద్ద పండుగగా నిలిచిన ఈ సందర్భం ప్రజలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.

శోభాయాత్ర ముగిసిన అనంతరం గ్రామంలోని మారడి పోచమ్మకి పోలేలా నైవేద్యం పెట్టి, ప్రత్యేక పూజా విధానాలు నిర్వహించి, గ్రామస్థులు వారి బంధు మిత్రులతో కలసి భోజనాలు చేశారు.

ఈ వేడుకలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాములు, సొసైటీ డైరెక్టర్ శివరాజ్ పటేల్, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ పండుగ సామాజిక, సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తూ గ్రామస్తుల మధ్య సంతోషాన్ని, ఐక్యతను నింపింది అని బారడి పోచమ్మ పండుగ ప్రతి ఏడాది గ్రామ ప్రజలకు ఆనందం ఇచ్చే ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంప్రదాయిక వేడుకగా అని గ్రామ పెద్దలు తెలియచేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment