|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణం లోని స్థానిక మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో రోడ్లపై ఉన్న మట్టిని తొలగించేందుకు ప్రత్యేక వాహనం ఉపయోగించబడింది.
ఈ చర్య ముఖ్యంగా భక్తుల కోసం తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన లింబాద్రిగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు, వాహనదారులు రోడ్లపై ఎక్కువగా ప్రయాణించటంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం అని,
జాతర వేడుకల సందర్భంలో రోడ్లపై గల మట్టివల్ల వాహనదారులకు, భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలసి రోడ్లపై మట్టిని తొలగించడం ద్వారా భక్తులు వాహనదారులు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా మరింత సౌకర్యంగా ప్రయాణించగలరని తెలిపారు. ఈ పనిలో మునిసిపల్ సిబ్బంది, ఓంకార్, శ్రీధర్ తదితరులు సమర్థవంతంగా పాల్గొన్నారు.








