|| దృశ్యం న్యూస్ ||
నిర్మల్ జిల్లా బాసరలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఉప్పలించి వేణు, ఆయన భార్య అనురాధ మరియు కూతురు పూర్ణిమ బుధవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశారు, వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షల అప్పు తీసుకున్న వేణు అప్పు చెల్లించలేని పరిస్థితిలో సదరు వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చెయ్యడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు యత్నించినట్లు అనురాధ వెల్లడించింది.

స్థానిక జాలరులు అనురాధను కాపాడి బయటకు తియ్యగా తండ్రి వేణు, కూతురు పూర్ణిమ గల్లంతయ్యారు, అనంతరం పోలీసులు గజ ఈతగాళ్లు సహాయంతో వేణు మృతదేహాన్ని నదినుంచి బయటకు తీశారు. పూర్ణిమ కోసం గాలింపు కొనసాగుతోంది. సీఐ మల్లేష్, ఎస్సై గణేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.








