మట్టి స్నానాలు: ప్రజలందరికీ ఆహ్వానం – ఆరోగ్యానికి అద్భుతమైన అవకాశం.

|| దృశ్యం న్యూస్ ||

పతాంజలి యోగ సొసైటీ తానాకలన్ ఆధ్వర్యంలో 16-03-2025 ఆదివారం ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో యోగ రత్న ఏతోండ ప్రభాకర్ మరియు కిషన్ నేతృత్వంలో పుట్ట మట్టి, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, మరియు ఇతర సమృద్ధిగా ఉపయోగించే మూలికలు కలిపి స్నానం చేస్తారు.

ఈ మట్టి స్నానం వల్ల చర్మవ్యాధులు, గజ్జి, తామర, సోరియాసిస్, చికెన్ పప్స్, పూత, చుండ్రు వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని, ఈ విధమైన స్నానం అనేక రకాల మూలికల తో చర్మానికి ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తుంది అని ప్రభాకర్ తెలిపారు.

అదేవిధంగా నిజామాబాదు పరిసర ప్రాంతాల్లోని యోగా సెంటర్ల యోగా గురువులు, సాధకులు, మరియు నవీపేట్, నందిపేట్, బోధన్, ఎడపల్లి, మోస్రా, బాన్సువాడ మరియు ఇతర ప్రాంతాల నుండి యోగ సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమం అనంతరం అల్పాహారం కూడా అందించబడుతుంది అని, ప్రజలందరికీ స్వాగతం తెలుపుతూ ఈ ఆరోగ్యకరమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వవచ్చు అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment