|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో, దరఖాస్తుదారులు 25% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్చి 31, 2025 లోగా రుసుము చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుకు దరఖాస్తుదారుల చొరవ
2020లో స్వీకరించిన అనధికార లే అవుట్ ప్లాట్ల దరఖాస్తులను ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించింది. 22,000 దరఖాస్తుదారులు ఇప్పటికే రుసుము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. హౌస్ ఓనర్లకు SMS ద్వారా సమాచారం అందించడం జరుగుతోందని, వెంటనే ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని తెలిపారు.

– ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసామని,.
– MPDO ల ద్వారా ఫోన్ కాల్స్ చేసి 31వ తేదీ లోపు రుసుము చెల్లించుకునేలా అవగాహన కలిపిస్తున్నామని.
– సబ్-రిజిస్టర్ కార్యాలయాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా సలహాలు, సూచనల కోసం,
– జిల్లా కలెక్టర్ కార్యాలయం: 9154293341
– రామాయంపేట పురపాలక కార్యాలయం: 9963290800 సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.








