|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలంలో మంగళవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందజేశారు.
రాదేశ్యామ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొత్తం 52 మంది లబ్ధిదారులకు రూ. 52,06,032/- విలువైన చెక్కులను అందజేశామని, తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి మరింత మంది ప్రయోజనం పొందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.








